ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిజాంపట్నం గోకర్ణ మఠంలోని రాయల్ మెరైన్ రొయ్యల కంపెనీలో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో 107 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. రొయ్యలను శుభ్రపరి చేటప్పుడు సోడియం హైపోక్లోరేట్ ద్రావణం బదులు పొరపాటున హైపోక్లోరైట్ తో పాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను కలిపి క్లీన్ చేయడంతో ఈ ఘటన జరిగింది.
ALSO READ : ఏపీలో ఇంత దారుణమా : మూడున్నరేళ్ల చిన్నారిని రేప్ చేసి.. చంపి.. పాతిపెట్టేశాడు.. !
దీంతో ఒక్కసారిగా పొగలు రావడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయి తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అస్వస్థతకు గురైన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొద్ది మంది కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.