పాక్​లో బాంబు పేలి ముగ్గురు చిన్నారులు మృతి

పాక్​లో బాంబు పేలి ముగ్గురు చిన్నారులు మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో దారుణం జరిగింది. బన్నూస్ వజీర్ సబ్ డివిజన్‌‌‌‌‌‌‌‌లోని జానీ ఖేల్ ఏరియాలో టాయ్ బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు చనిపోయారని అధికారులు సోమవారం వెల్లడించారు. 

అందులో ఇద్దరు అన్నదమ్ములని తెలిపారు. మదర్సా నుంచి ఇంటికి వెళుతున్న పిల్లలు మార్గమధ్యలో పడిఉన్న  బాంబును చూసి బొమ్మగా భావించారని చెప్పారు. దాన్ని చేతుల్లోకి తీసుకోగానే అది ఒక్కసారిగా పేలిందన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.