సింగరేణిలో బొమ్మల కొలువు

సింగరేణిలో బొమ్మల కొలువు

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని ఇల్లందు క్లబ్‌‌‌‌‌‌‌‌లో లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అనిత ఆధ్వర్యంలో బుధవారం బొమ్మల కొలువు నిర్వహించారు. ఎడ్లబండిపై ప్రయాణించడంతోపాటు సంస్కృతి ప్రతిబింబించేలా కుటీరం, మంచె, పర్ణశాల, పురాతన పనిముట్లు, వివిధ రకాల బొమ్మలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమానికి చీఫ్‌‌‌‌‌‌‌‌గెస్ట్‌‌‌‌‌‌‌‌లుగా సింగరేణి సీఎండీ సతీమణి శారద, డైరెక్టర్ (ఆపరేషన్స్) సత్యనారాయణరావు, హరిణి, సునీత హాజరయ్యారు. జీఎంలు డి.లలిత్ కుమార్, వెంకటయ్య పాల్గొన్నారు.