
బాస్కెట్లో బాల్‌ను ఎన్నిసార్లు కచ్చితంగా వేయగలరు? మధ్యలో ఒక్కసారిగా కూడా బాల్ కింద పడకూడదు. ఇగో ఈ టయోటా తయారు చేసిన ఈ రోబో గురి తప్పకుండా 2,020 సార్లు బాల్‌ను బాస్కెట్లో పడేసింది. అది చూసి ముచ్చటేసిన గిన్నిస్ బుక్కోళ్లు.. దానికి ఓ పేజ్ ఇచ్చారు. ఆరడుగుల 10 అంగుళాల ఎత్తున్న ఈ రోబో పేరు క్యూ. 2020 ఒలింపిక్స్‌కు గౌరవ సూచకంగా ఇలా 2020 సార్లు బాస్కెట్ బాల్ టార్గెట్‌ను రోబోతో చేయించి రికార్డు సృష్టించింది టయోటా కంపెనీ. అల్లంత దూరంలోని బాస్కెట్‌ను సరిగ్గా అంచనా వేసేందుకు రోబోలో త్రీడీ ఇమేజ్ సెన్సర్లు పెట్టారు.