రెనాల్ట్ కైగర్‌లో అప్‌డేటెడ్ వెర్షన్
కైగర్ మోడల్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను రెనాల్ట్ తీసుకొచ్చింది. కైగర్ ఆర్‌ఎక్స్‌టీ (ఓ) ఎంటీ వేరియంట్‌ను రూ.7.99 లక్షల (ఎక్స్ షోరూమ్) కు అమ్ముతోంది. 8 ఇంచుల టచ్‌స్క్రీన్, ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, ఆల్లోయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఈ బండిలో ఉన్నాయి. మరోవైపు ఆర్‌ఎక్స్‌జెడ్ వేరియంట్ కొనేవారికి వివిధ రకాల బెనిఫిట్స్ అందిస్తోంది.
మారిన టయోటా న్యూ ఇన్నోవా ధరలు
న్యూ ఇన్నోవా క్రిస్టాలోని టాప్ రెండు వేరియంట్ల ధరలను టయోటా కిర్లోస్కర్ సవరించింది. జెడ్‌ఎక్స్ వేరయంట్ ధర రూ. 25,23,000 ఉండగా, వీఎక్స్ వేరియంట్ ధర రూ.23,84,000 నుంచి ప్రారంభమవుతోంది. న్యూ ఇన్నోవా క్రిస్టాలో 2.4 లీటర్ల డీజిల్ ఇంజిన్ అమర్చారు. 5 మాన్యువల్ గేర్లు ఉంటాయి. 7 ఎయిర్ బ్యాగ్‌లు, ఫ్రంట్, బ్యాక్ పార్కింగ్ సెన్సర్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ బండ్లలో ఉన్నాయి.
ఇండియాలోకి డుకాటి మాన్‌స్టర్ ఎస్‌పీ
మాన్‌స్టర్ ఎస్‌పీ మోడల్‌ను ఇండియాలో డుకాటి లాంచ్ చేసింది. ఈ బండి ధర రూ.15.95 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ వెహికల్‌లో 937 సీసీ ఇంజిన్ సామర్ధ్యం ఉంటుంది. 6,500 ఆర్‌పీఎం వద్ద 93 ఎన్‌ఎం టార్క్యూను ప్రొడ్యూస్ చేయగలదు. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని, డెలివరీస్‌ను వెంటనే ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.