వరల్డ్ వైడ్గా రోజుకు రోజుకు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. వీటి ఉత్పత్తిలోనూ భారీ మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సాంప్రదాయ ఇంధన వాహనాలకు ప్రాధాన్యం తగ్గి.. ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ లభిస్తున్న క్రమంలో జపాన్ కు చెందిన టయోటా సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించబోతుంది.
10 నిమిషాలు చార్జ్..1200 కి. మీ
జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం టయోటా ఓ సూపర్ కారును లాంఛ్ చేయబోతుంది. దాదాపు 1,200 కిలో మీటర్లు (750 మైళ్లు) ప్రయాణించే ఎలక్ట్రిక్ కారును త్వరలో తీసుకురానుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్ చేస్తే చాలు ఈ కారులో 1200 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. సాలిడ్-స్టేట్ బ్యాటరీతో ఈ కారు నడుస్తుందని టయోటా పేర్కొంది. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ఈ కారు దూసుకుపోనుంది.
హై పర్ఫామెన్స్ బ్యాటరీ..
టయోటా కంపెనీ హై పర్ఫామెన్స్ బ్యాటరీని కూడా అందుబాటులోకి తేనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే వెయ్యి కిలో మీటర్లు నడిచే లిథియం-అయాన్ బ్యాటరీని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపింది. 2026 నాటికి ఈ కొత్త బ్యాటరీ కారును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రకటించింది.