హైదరాబాద్, వెలుగు: వెహికల్ ఫైనాన్సింగ్ అందించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసినట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ శుక్రవారం తెలిపింది. ఈ భాగస్వామ్యం కింద, వినియోగదారులకు టయోటా వెహికల్స్ఆన్-రోడ్ ధరపై 90 శాతం వరకు ఫైనాన్సింగ్ పొందవచ్చు.
ఫోర్క్లోజర్ లేదా పార్ట్-పేమెంట్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ వెహికల్ కస్టమర్లు సంవత్సరానికి 8.8 శాతం నుంచి వడ్డీ రేట్లతో 7 సంవత్సరాలలోపు అప్పును చెల్లించవచ్చని టయోటా కర్లోస్కర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.