టయోటా మోటార్ కంపెనీ బుధవారం (జనవరి 3) న 1 మిలియన్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్ లు పనిచేయకపోవడం, దీంతో గాయపడే ప్రమాదం తీవ్రంగా ఉండటం అని తెలిపింది. ఎయిర్ బ్యాగ్స్ లోపాలున్న 2020 నుంచి 2022 వరకు మోడల్ టయోటా, లెక్సెస్ వాహనాల సిరీస్ ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.వీటితోపాటు టయోటా అవలోన్స్, క్యామ్రీస్, హైలాండర్స్, RAV4లు సీయోన్నాస్, కరోలాస్, వాటి కొన్ని హైబ్రిడ్ మోడళ్లను రీకాల్ చేసింది. రీకాల్ లోని లెక్సస్ మోడళ్లలో ES250, సెడాన్, RX350 SUVఉన్నాయి.
టయోటా ఎందుకు తన వాహనాలను రీకాల్ చేసింది అంటే..
రీకాల్ చేయబడిన వాహనాలకు ముందు ప్యాసింజర్సీటులో సెన్సార్లు ఉన్నాయి. అవి సరిగ్గా తయారు చేయకపోవడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ కు దారి తీయొచ్చు. దీనివల్ల ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ లో ఉండే వ్యక్తి బరువును సరిగ్గా గుర్తించకపోవచ్చు.. కొన్ని రకాల క్రాష్ ల సమయంలో అవి సయర్థవంతంగా పనిచేయకపోవచ్చు అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
టయోటా, లెక్సాస్ డీలర్లు OCS సెన్సాలను తనఖీ చేస్తారు. అవసరమైతే యజమానులకు ఎటువంటి ఖర్చులు లేకుండా వాటిని తిరిగి అమర్చుతారు. కస్టమర్లు తమ కార్లు రీకాల్ లో ఉంటే ఫిబ్రవరి 2024 మధ్యలో టయోటా వారికి తెలియజేస్తుంది.
రీకాల్ లో తమ కారు ఉంటే టయోజా యజమానులు వివరాలకోసం 1-800-331-4331కి కాల్ చేయవచ్చు. Lexus వాహనాలకు కోసం యజమానులు మరింత సమాచారం కోసం 1-800-255-3987కి కాల్ చేయొచ్చు.