ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందేనన్నారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ల కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని చెప్పారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయ్యిందన్నారు మహేశ్ కుమార్.
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి..ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీలో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందన్నారు. ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందన్నారు మహేశ్ కుమార్ గౌడ్.
Also Read :- కండిషన్లపైనే కవితకు బెయిల్
ఆగస్టు 27న సుదీర్ఘ వాదనల తర్వాత కవితకు బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో 2024, మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ, సీబీఐ విచారణ నడుస్తుంది. ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.