హత్యకు గురైన బాలుడి కుటుంబానికి రేవంత్ పరామర్శ 

హత్యకు గురైన బాలుడి కుటుంబానికి రేవంత్ పరామర్శ 

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని మిట్టీబౌలీలో ఇటీవల కిడ్నాప్, హత్యకు గురైన పన్నెండేళ్ల బాలుడు రజాక్ ఖాన్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. బాలుడి తండ్రిని కలిసి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కొడంగల్ లో కిడ్నాప్, హత్యల సంస్కృతి గతంలో లేదని, ఇప్పుడు  ఇలాంటి సంస్కృతి పెరగడం మంచిది కాదని రేవంత్ అన్నారు. ఈసందర్భంగా వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డితో ఫోన్ లో మాట్లాడి కేసు పురోగతిపై వివరాలను రేవంత్ తెలుసుకున్నారు. ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అవసరమైతే ఐజీతో కూడా మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.