- క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు
- ఇంచార్జిలు అందరిని కలుపుకోని పోవాలె
- ఉమ్మడి మెదక్‌జిల్లా నాయకులకు టీపీసీసీ చీఫ్వార్నింగ్
హైదరాబాద్: నియోజకవర్గ ఇంచార్జిలు భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ సూచించారు. ఇవాళ గాంధీభవన్‌లో మెదక్ ఉమ్మడి జిల్లా నాయకుల సమావేశంలో పీసీసీ చీఫ్ మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా కీలకమని, దీనిని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ఇచ్చారు. స్థానిక సంస్థల, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోని, కష్టపడి పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ స్కీంలను జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రౌండ్లెవల్లో పార్టీ కోసం నాయకులంతా మరింత గట్టిగా పనిచేయాలన్నారు. నియోజకవర్గ ఇంచార్జిలు అందరినీ కలుపుకొని పోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు.
పార్టీకి మెదక్ కీలకం
కాంగ్రెస్ పార్టీకి మెదక్‌తో అత్యంత ప్రాముఖ్యత ఉందని, ఇక్కడ గతంలో ఇందిరాగాంధీ ఎంపీగా పనిచేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్మున్షీ అన్నారు. ఉమ్మడి మెదక్‌జిల్లా నాయకులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు.. మెదక్‌లో కేసీఆర్, హరీశ్‌రావు లాంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నాయని ఈ క్రమంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు.
రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకువచ్చేలా పనిచేయాలని సూచించారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. నాయకులు పట్టుదల, సమన్వయంతో పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయన్నారు.