- మంచి ముహూర్తం వెయిట్ చేస్తుండ్రు
- కాంగ్రెస్లో చేరిన సోయం, ఆత్రం
హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ సోయం బాపూరావు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో వీరిద్దరూ హస్తం పార్టీలో చేరారు. అనంతరం మహేశ్కుమార్గౌడ్మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు.
ఆ ఎమ్మెల్యేలు మంచి ముహూర్తం చూసుకొని హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని పేర్కొన్నారు.