కౌశిక్ రెడ్డి.. ఇప్పటికైనా తీరు మార్చుకో: TPCC చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదని.. కేవలం కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని హితవు పలికారు. కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాదులోని దేవరాంజాల్‎లో యూత్ సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. ఈ వేడుకలకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు. యూత్ కాంగ్రెస్ నేతలో కలిసి గాలిపటం ఎగరేస్తూ సరదగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల్లో ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి వేడుకలు ఇలా హైదరాబాద్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

ALSO READ | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్

మన తెలుగు పండుగలను రాబోయే తరాలకు అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 13న హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కరీంనగర్ తరలించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. మేజిస్ట్రేట్ కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.