హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ నివాళులు అర్పించారు. నార్సింగ్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరిన మహేష్ గౌడ్ అమరవీరులకు స్థూపం వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం భారీ ర్యాలీగా గాంధీ భవన్‌కు చేరుకోనున్నారు.
ALSO READ | నిమజ్జనం తర్వాత చూసుకుందాం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం స్వీట్ వార్నింగ్
నూతన టీపీన్నికైసీసీ చీఫ్‌గా ఎన మహేష్ గౌడ్ ఇవాళ (సెప్టెంబర్ 15) మధ్యాహ్నం 2.45 నిమిషాలకు గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి నుండి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ, రాష్ట్రానికి చెందిన కీలక కాంగ్రెస్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహేష్ గౌడ్ ప్రసంగించనున్నారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం ముగియడంతో అతడి స్థానంలో ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించిన విషయం తెలిసిందే.