గంగారెడ్డి మర్డర్ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

గంగారెడ్డి మర్డర్ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మోర గంగారెడ్డి హత్య జగిత్యాల నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మోర గంగారెడ్డిని దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ క్రమంలో గంగారెడ్డి హత్య ఘటనపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మంగళవారం (అక్టోబర్ 22) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి హత్య వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. గంగారెడ్డి మరణంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడానని.. ప్రధాన అనుచరుడు హత్యకు గురికావడంతో ఆయన ఆవేదనకు గురి అయ్యారని తెలిపారు. 

ALSO READ | తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఈటల ధ్యేయం: ఆది శ్రీనివాస్ ఫైర్

అనుచరుడి మరణంతో  బాధలో ఉండే కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని అన్నారని చెప్పారు. జీవన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత అని.. ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటామన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చిన చోట కొంత ఇబ్బంది ఉందన్న మహేష్ గౌడ్.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. జగిత్యాల  నియోజకవర్గ అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించామని  చెప్పారు. కాగా, ప్రధాన అనుచరుడు హత్యకు గురి కావడంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. హత్యకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.