దావోస్ లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇంత పెట్టుబడులు రాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ చరిత్రలో లక్షా 79 వేల పెట్టుబడులు రావడం రికార్డ్ అని అన్నారు. సంవత్సర కాలంగా రాష్ట్రం సాధించిన పురోగతే ఈ పెట్టుబడులకు కారణమని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ. 27 వేల 500 కోట్లు మాత్రమే అని.. కేసీఆర్ ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. 2015 నుంచి 2019 వరకు వచ్చిన పెట్టుబడులు సున్నా అని అన్నారు. అన్ని హంగులతో ఫోర్త్ సిటీ రాబోతోందని అన్నారు.
ALSO READ | మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్