తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీ పీసీసీ చీఫ్   మహేష్ కుమార్  గౌడ్  స్పందించారు. ఢిల్లీ ఫలితాలను చూసి ఇక్కడ బీజేపీ నాయకులు అమితానంద పడుతున్నారని అన్నారు. తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని చెప్పారు.  తెలంగాణలో తాము  చేస్తున్న అభివృద్ధే కాంగ్రెస్ పార్టీకి రక్ష అని అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలని అమలు చేస్తూ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ సుస్థిర స్థానాన్ని సంపాదించిందన్నారు.  ఈ సంక్షేమ పథకాలే మళ్లీ కాంగ్రెస్ ను  గెలిపిస్తాయన్నారు. 

ALSO READ | ఢీల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలే బీజేపీని గెలిపించాయా..?

కేటీఆర్ పరిస్థితి విచిత్రంగా ఉందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. బీజేపీని అభినందించలేక లో లోపల మురిసిపోతున్నారని అన్నారు. కేసీఆర్  కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా త్వరలోనే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహేశ్ కుమార్ గౌడ్.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.