7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను మా చేతిల పెట్టిండు

7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను మా చేతిల పెట్టిండు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందని.. తొమ్మిది నెలల ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్‍లో ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే వాహనాలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతు రావుతో కలిసి మహేష్  గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాయని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను మా చేతిలో పెట్టి పోయాడని.. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతూ సీఎం రేవంత్ హామీలను అమలు చేస్తున్నాడని తెలిపారు. 

Also Read:-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వాన

కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము.. ప్రభుత్వం మనదే మరింతగా కష్టపడి పని చేయండని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని.. పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానని స్పష్టం చేశారు. కాగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ గౌడ్ ను ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.