అదానీని అరెస్ట్ చేయాలి.. మోదీ అండతోనే అవినీతి సామ్రాజ్యం: మహేశ్ కుమార్ గౌడ్

అదానీని  అరెస్ట్ చేయాలి.. మోదీ అండతోనే అవినీతి సామ్రాజ్యం: మహేశ్ కుమార్ గౌడ్

అదానీ కుంభకోణాలపై జేపీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.  తక్షణమే అదానీని అరెస్ట్ చేయాలన్నారు. 2014 తర్వాత అదానీ ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. ఈ దేశంలో దోపిడి జరుగుతుంటే మోదీ కల్లు మూసుకున్నారా అని నిలదీశారు మహేశ్ కుమార్.  మోదీ అండతోనే అదానీ అవినీతి సామ్రాజ్యం నిర్మించారని మండిపడ్డారు.

అదానీ దాదాపు రూ.2 వేల కోట్ల లంచాలు పంచారని ఆరోపించారు మహేశ్ కుమార్ గౌడ్. అర్హత లేకున్నా దేశంలో అదానీకి వేల కోట్ల రుణాలు ఇచ్చారని అన్నారు.  స్కిల్ వర్సిటీకి అదానీ రూ. 100 కోట్లు ఇచ్చారనేది వాస్తవమన్నారు.   చట్టాలకు లోబడి వ్యాపారాలు చేసుకుంటే తమకేం ఇబ్బంది లేదన్నారు. అదానీ చర్యల వల్ల ప్రజలు నష్టపోతున్నారని విమర్శించారు. 2014-2024 కేంద్ర లావాదేవీల్లో అదానీ పాత్ర ఉందన్నారు.  అదానీ అవినీతి నిరూపితమైతే ఆయన పెట్టుబడులపై ఆలోచిస్తామన్నారు మహేశ్ కుమార్ గౌడ్.   చట్టానికి లోబడే వ్యాపారాలనే తెలంగాణలో అనుమతిస్తామని చెప్పారు.

ALSO READ : హైదరాబాద్‎లో ఫుడ్ కల్తీ చేస్తున్నారా..? అయితే ఇక మూడినట్లే..

సెబీ పూర్తిగా విఫలమైందని.. ఛైర్మన్ ను తొలగించాలని తాము డిమాండ్ చేశామన్నారు మహేశ్ కుమార్ గౌడ్. సెబీ ఛైర్మన్ ను మోదీ ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. దేశంలో ఈడీ, సీబీఐ, ఈడీ ప్రధాని గుప్పెట్లో పనిచేస్తున్నాయని ఆరోపించారు. 90 శాతం ఏజెన్సీ తనిఖీలు ప్రతిపక్ష నేతలపైనే జరిగాయని ఆరోపించారు. బీజేపీ పెత్తందారుల పార్టీ..కార్పొరేట్ల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందన్నారు మహేశ్ కుమార్ గౌడ్.