- కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం
- రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కార్యకర్తల వల్లే
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
కామారెడ్డి, భిక్కూరు, వెలుగు: వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని, అంతవరకు కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు విశ్రమించొద్దని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపు ఇచ్చారు. నిజామామాబాద్ జిల్లాకు వెళ్తున్న ఆయనకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో హైవేపై జిల్లా నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తల బలంతోనే రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అధికారం వస్తుంది, పోతుంది పార్టీ మాత్రమే శాశ్వతమన్నారు.
రాష్ర్టంలో పార్టీ అధికారంలోకి రావటం సైమీఫైనల్అని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావటం ఫైనల్అన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్ఎస్ యూ ఐలో పని చేసిన తనను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా అధిష్టానం ఎంపిక చేసిందన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నిలలో 90 శాతం సీట్లు గెలవాలన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. మోడీ తన పాలనలో పెత్తందారులకే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు.
సంపదనంతా ఆదాని, అంబానీలకే దోచి పెడుతున్నారని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గాంధీ కుటుంబం మాటమీద నిలబడే కుటుంబమన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న పనులను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, లీడర్లు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, భీమ్‌రెడ్డి, పండ్ల రాజు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో..
ఇందల్వాయి, వెలుగు: పీసీసీ ప్రెసిడెంట్‌గా తొలిసారి జిల్లాకు విచ్చేసిన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు శుక్రవారం ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న ఆయనకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పార్టీ లీడర్లు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తలవల్లే తమకు పదవులు వచ్చాయని, ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు పదవులు కట్టబెట్టడమే తమ లక్ష్యమన్నారు.
డిచ్పల్లి వద్ద గజమాల తో పీసీసీ చీఫ్‌ను స్థానిక లీడర్లు సన్మానించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సభాస్థలికి ర్యాలీగా తరలివెళ్లారు.