గాంధీభవన్ అంటే మాకు దేవాలయంతో సమానమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.సోనియా మా దేవత అన్నారు.సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం తన కుటుంబ అవసరాలకు వాడుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని నా నియామకమే నిదర్శనమన్నారు.
గతంలో కేసీఆర్ ఇబ్బంది పెట్టిన తీరును చూసి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి .. ఇతర కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి తనకు ప్రోత్సాహమిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉందన్నారు. ఎవరు ఎప్పుడు విమర్శించుకున్నా.. ప్రజలకోసం అందరం ఏకమవుతామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. గాంధీ భవన్ తో తనకు 40 ఏళ్లు విడదీయరాని సంబంధం ఉందన్నారు.
సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నానన్నారు. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు సహజంగా ఉంటాయని అన్నారు. రాజకీయాల్లో పనిచేసేందుకు అవకాశం వచ్చేవరకు ఎదురు చూడాలన్నారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్నారు. తాను పీసీసీ చీఫ్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పవర్ సెంటర్ అన్నారు.
ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు ముందుండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొంతమంది సోషల్ మీడియాను సెన్స్ లేకుండా వాడుతున్నారని అన్నారు. తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలు, ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. అందుకే వరదలు వచ్చినప్పుడు ఇండ్లు మునుగుతున్నాయన్నారు.
ALSO READ | ఇది సెమీ ఫైనల్స్ మాత్రమే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
ప్రతి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గాంధీభవన్ ఉంటేనే ప్రభుత్వం ఉంటుందన్నారు. గాంధీభవన్ కు ప్రతివారం ఇద్దరు మంత్రులు రావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నెలకు ఒకసారి గాంధీభవన్ కు రావాలన్నారు. ప్రభుత్వం నడపడం అంటే ఆషామాషీ కాదని.. కేసీఆర్ మాదిరిగా ఫాంహౌస్లో ఉండి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నడపడం లేదన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.