పార్టీ లైన్ దాటితే ఎవర్నీ వదలం..అందరికీ ఇదే వార్నింగ్: మహేశ్ కుమార్ గౌడ్

పార్టీ లైన్ దాటితే ఎవర్నీ వదలం..అందరికీ ఇదే వార్నింగ్: మహేశ్ కుమార్ గౌడ్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సస్పెన్సన్ పై టీ పీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.  పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని  హెచ్చరించారు. తీన్మార్  మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామన్నారు. బీసీ కులగణన కాపీలు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పని  పార్టీ లైన్  దాటితే ఎవరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

 పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ మార్చి 1న తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.  నోటీసులిచ్చినా వివరణ ఇవ్వకపోవడంతో  మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

కొన్ని రోజుల క్రితం  వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో  కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ  తీన్మార్ మల్లన్న   అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గంపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని..క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  తీన్మార్ మల్లన్నపై  చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు  రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం వివరణ ఇవ్వాలంటూ ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులిచ్చింది. మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది