కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ప్రభుత్వం సొమ్ము తిన్న వారికి శిక్ష తప్పదన్నారు. ఈ ఫార్ములా రేస్ కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని ఆరోపించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ శఖం ముగిసిందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండదన్నారు. తండ్రీ కొడుకులు తప్ప ఆపార్టిలో ఎవ్వరు ఉండరన్నారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. కవిత ఎందుకు జైలుకు వెళ్లిందో అందరికీ తెలుసన్నారు. ఘరానా మోసగాళ్ళు బీ ఆర్ ఎస్ వాళ్ళు అని విమర్శించారు. కేసీఆర్ చేసిన విధ్వంసంను పూడ్చే పనిలో ఉన్నామన్నారు మహేశ్ కుమార్.
ALSO READ | వెనక్కి తగ్గని ఏసీబీ.. కేటీఆర్కు మరోసారి నోటీసులు
ఒక్క కుర్చీ కోసం ముగ్గురు కొట్లాడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అధ్యక్ష పదవి కోసం కేటీఆర్, హరీశ్,కవిత పోటీ పడుతున్నారని అన్నారు. హరీశ్ రావ్ వేరే పార్టీ చూసుకోవాల్సిందేనన్నారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు.. ప్రపంచంలోనే అత్యంత ప్రజా ధనం దుర్వినియోగం, దోపిడీ చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం అని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీ లేని రంగం లేదన్నారు. ఫామ్ హౌస్ కు పరిమితం అయినా కేసీఆర్ ప్రతిపక్ష హోదా అవసరమా అని అన్నారు.