బీఆర్ఎస్ నుంచి త్వరలోనే మరిన్ని చేరికలు : మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ నుంచి త్వరలోనే మరిన్ని చేరికలు : మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ నుంచి  త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.  కేటీఆర్ తో తిరుగుతున్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై  త్వరలోనే  స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.  సుప్రీంకోర్టు పోయిన తమకు న్యాయమే జరుగుతుందన్నారు మహేశ్ కుమార్. తాము చేసిన మంచి పనులు చూసి ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ వైపు  వస్తున్నారని చెప్పారు. ఎంతమంది టచ్ లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు.

ALSO READ | నాగలి పట్టి దున్నిన మోహలా మీవి.. గుట్టలు మాయం చేసిన మీరా మాట్లాడేది : రేణుకా చౌదరి

అదానీ అవినీతి నిరూపితమైతే ఆయన పెట్టుబడులపై ఆలోచిస్తామన్నారు మహేశ్ కుమార్ గౌడ్.   చట్టానికి లోబడే వ్యాపారాలనే తెలంగాణలో అనుమతిస్తామని చెప్పారు. సెబీ పూర్తిగా విఫలమైంది.. ఛైర్మన్ ను తొలగించాలని తాము డిమాండ్ చేశామన్నారు మహేశ్ కుమార్ గౌడ్. సబీ ఛైర్మన్ ను మోదీ ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. దేశంలో ఈడీ, సీబీఐ, ఈడీ ప్రధాని గుప్పెట్లో పనిచేస్తున్నాయని ఆరోపించారు. 90 శాతం ఏజెన్సీ తనిఖీలు ప్రతిపక్ష నేతలపైనే జరిగాయని ఆరోపించారు. బీజేపీ పెత్తందారుల పార్టీ..కార్పొరేట్ల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందన్నారు