
- దొంగ కేసులు కోర్టులో వీగిపోతాయ్
- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- ఈడీ ఆఫీసు వద్ద ఆందోళన
హైదరాబాద్: మోదీ ప్రభుత్వం సోనియా, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు నమోదు చేసిందని, అవన్నీ కోర్టులో వీగిపోతాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో సోనియా, రాహుల్ పై ఈడీ చార్జిషీట్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తమ పత్రిక లో తమ పార్టీ డబ్బులు పెడితే మాని లాండరింగ్ కేసు పెట్టడం కుట్ర పూరితమని అన్నారు.
►ALSO READ | మీ భూములు మీ ఇష్టం..చెట్లు నరకొద్దు
నేషనల్ హెరాల్డ్ లో ఎలాంటి తప్పూ జరగలేదని అన్నారు. మసిపూసి మారేడు కాయ చేయాలని బీజేపీ చూస్తోందని అన్నారు. మనీ ల్యాండరింగ్ కేసులు 90% ప్రతిపక్ష నేతల మీదే నమోదవుతున్నాయని ఆరోపించారు. ఈడీ అధికారులు స్వయం ప్రతిపత్తిని మర్చిపోయి పనిచేస్తున్నారని అన్నారు. కులం, మతం పేరుతో, ఈడీ, సీబీలను ఉపయోగించుకొని మోదీ సర్కారు రాజకీయం చేస్తోందని అన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని మోదీ భయపడుతున్నారని అన్నారు. అందుకే దొంగ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అవన్నీ కోర్టులో వీగిపోతాయని చెప్పారు.