బండి సంజయ్ కి ఓటు వేసినోళ్లు బాధపడుతున్నారు: పీసీసీ చీఫ్ మహేశ్

బండి సంజయ్ కి ఓటు వేసినోళ్లు బాధపడుతున్నారు: పీసీసీ చీఫ్ మహేశ్

బండి సంజయ్ కు ఓటేసిన వాళ్ళు బాధపడే పరిస్థితి  వచ్చిందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.  మత విద్వేషాలు రెచ్చ గొట్టి లబ్ధి పొందడం బండి సంజయ్ కి అలవాటుగా మారిందన్నారు. క్రికెట్ ను రాజకీయాలకు ముడి పెట్టడం సిగ్గు చేటని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు. అందుకే  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ పోటీ పెట్టలేదన్నారు.

 పాకిస్థాన్ పేరు, మతం పేరు చెప్పకుండా ఏనాడైనా ఓటు అడిగారా? శ్రీరాముడిని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ. శ్రీరాముడే బీజేపీని స్థాపించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. మీరు సంపన్నులను పెంచి పోషించడం తప్ప మీరు పేదలకు చేసిందేమీ లేదు.56 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది‌.  ఫార్ములా ఈ - కేసులో కేటీఆర్ అక్రమాలపై కేసులు పెట్టాం. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం. దానిపైనా కేసులు పెట్టాం. మీరు చొరవ చూపి విదేశాల్లో దాక్కున్న వారిని ఎందుకు రప్పించడం లేదో చెప్పాలి.  గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడే సంజయ్... తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడరు. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు.  ఇప్పుడే ఇండియా- పాకిస్థాన్ గుర్తొస్తాయి . తెలంగాణ అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటి?.  బీసీల మీద ప్రేమ ఉంటే మోడీని ఒప్పించి 9వ షెడ్యూల్ లో చేర్పించాలి‌.  అడుగడుగునా బీసీలను అణచివేసే బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు. బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెసే.  బీసీ గ్రాడ్యుయేట్లు ఆలోచించి కాంగ్రెస్ కు ఓటేయాలి.  సోషల్ మీడియాను  అబద్దాల ప్రచారం కోసం అనైతికంగా వాడుతున్నారు.