
తెలంగాణలో బీజేపీ,బీఆర్ఎస్ నాటకాలాడుతన్నాయని ఫైర్ అయ్యారు టీ పీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ తో కలిసి కిషన్ రెడ్డి లాలూచీ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. పొద్దున లేస్తే కులాలు ,మతాలు పంచాయతీ పెట్టేప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి కాదు కిస్మత్ రెడ్డి. కష్టం లేకుండా గెలుస్తున్నారని అన్నారు.
మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. పొద్దున లేస్తే కిషన్ రెడ్డి ముస్లిమ్ జపం చేస్తడు. అక్బరుద్దిన్ ఒవైసీ మీదనే కిషన్ రెడ్డి రాజకీయం చేస్తడు. పోయిన జన్మలో ఒవైసీ, కిషన్ రెడ్డి బ్రదర్స్ అయి ఉంటారు. చెప్పుతో ఎవరిని కొడతారు కిషన్ రెడ్డి. నువ్ మగాడివి అయితే 10 ఏండ్లలో నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చకు రా. దిగజారుడు భాష రాజకీయాల్లో మంచిది కాదు. 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు,ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏం తెచ్చారు. కిషన్ రెడ్డికి మతం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదు. రాష్ట్ర అభివృద్ధిపై కిషన్ రెడ్డి, సంజయ్ ..ఎంపీలతో ఏనాడైనా మాట్లాడారా.పనికిరాని వాళ్లు ఏఐ పోస్టులు పెడితే కిషన్ రెడ్డి వాటిని కాపీ కొడతాడు. బండి సంజయ్ ఎపుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదు. సన్నబియ్యం కేంద్రానివి అంటడు. మరి బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎందుకివ్వట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.