ఏచూరి ఆదర్శప్రాయుడు నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన ధీశాలి

ఏచూరి ఆదర్శప్రాయుడు  నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన ధీశాలి

సంతాప సభలో టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్: సమకాలీన రాజకీయాల్లో సీతారాం ఏచూరి ఆదర్శప్రాయుడు అని, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన ధీశాలి అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.  హైదరాబాద్ లోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభలో మహేశ్​కుమార్​మాట్లాడారు. ‘విద్యార్థి ఉద్యమం నుంచి కమ్యూనిస్టు భావాలను పుణికి పుచ్చుకుని దేశంలో ఎన్నో విప్లవాత్మక పోరాటాల్లో భాగస్వాములయ్యారు. 

ALSO READ | పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే

సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.  2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు, కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనలో కమ్యూనిస్టుల, ఏచూరి పాత్ర కీలకం. నేటి యువత ఏచూరి లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడం ఎంతైనా అవసరం ఉంది.  దేశంలో మతతత్వ శక్తులపై రాజీలేని పోరాటం చేసిన ఏచూరి శ్లాఘనీయుడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం ఇలాంటి లౌకికవాదిని కోల్పోవడం బాధాకరం’ అని అన్నారు.