హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రెండు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని గాంధీ భవన్ వర్గాలు ప్రకటించాయి. సోమ, మంగళవారం ఆయన రాష్ట్రంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరని తెలిపాయి.
బుధవారం నుంచి తిరిగి ఆయన గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారని, పార్టీ కార్యక్రమాల్లో యధావిధిగా పాల్గొననున్నారని వెల్లడించాయి. దీన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు గమనించాలన్నాయి. కుటుంబ సభ్యులతో ఆయన ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లారని గాంధీ భవన్ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.