యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో మన మునుగోడు మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఆయన పార్టీ జెండా ఎగరేసి లాంఛనంగా ప్రారంభించారు. అయితే జెండా రివర్సులో ఉండటంతో దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడులోని 175 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టుల వల్లే మునుగోడు అభివృద్ధి జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు కలిసికాంగ్రెస్ పార్టీని చంపే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. మునుగోడులో కమ్యూనిస్టులు పేదల పక్షాన పోరాడారన్న రేవంత్ రెడ్డి.. అక్కడ జరిగే యుద్ధంలో కమ్యూనిస్టు, కోదండరాం పార్టీలు కాంగ్రెస్కు మద్దతివ్వాలని అభ్యర్థించారు.