
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నవారిని వారంలో తీహార్ జైల్లో వేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేస్తే కేంద్రాన్ని అడ్డుకునే వారు ఎవరున్నారని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నేతలే ఈడీ విచారణకు హాజరయ్యారని.. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఎందుకు విచారణకు హాజరుకావట్లేదని ప్రశ్నించారు.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో రేవంత్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కల్చర్ పై దాడి చేస్తున్నాయని విమర్శించారు. ధరణి, రైతుల భూ సమస్యలపై స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఆందోళన చేశారు.