మోడీజీ..కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ ఏమైంది?

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇవాళ హైదరాబాద్ రానున్న ప్రధానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలతో ఆయన లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు అంటే ఎందుకంత చులకన అని అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోడీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి మీకున్న ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేశారని ఆరోపించారు

నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని అడిగారు. ఐటీఐఆర్ రద్దు చేశారు..స్టీల్ ఫ్యాక్టరీ ఊసేలేదు..మీ దృష్టిలో తెలంగాణకు అంత అప్రధాన్యత దేనికన్నారు. ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ల కుంభకోణంలో కేసీఆర్ బంధువుల పాత్ర ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పై ఈగ వాలకుండా కాపాడుతున్నది మీరు కాదా అని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని ప్రశ్నించారు.

ఇక గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ అతిగతీ లేదు..పైగా అదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేశారు..దీనిపై స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారా లేదా చెప్పాలన్నారు. రైతుల చావులకు బాధ్యులు మీరు కాదా అని ప్రశ్నించారు. రామయణ సర్క్యూట్ లో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు. ఈ ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్తారని ఆశిస్తున్నట్లు రేవంత్ తెలిపారు.
 

మరిన్ని వార్తల కోసం

బోగస్..మోర్ బోగస్..మోస్ట్ బోగస్ అంటున్న కార్తీ చిదంబరం

రూ.12లక్షలు పెట్టి మరీ కుక్కలా మారాడు