హైదరాబాద్ ఉప్పల్ చౌరస్తాలో అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఉప్పల్ చౌరస్తాలో అక్రమంగా మల్టీ ప్లెక్స్ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మంత్రి అండ... ఉప్పల్ చౌరస్తాలో అనుమతి లేని అక్రమ నిర్మాణం.... ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు... అంటూ ట్వీట్ లో రాశారు. మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా... లేదా మీరూ భాగస్వాములేనా అని ప్రశ్నించారు రేవంత్. నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను అటాచ్ చేస్తూ తెలంగాణ CMO కు, GHMC కమిషనర్ కు ట్యాగ్ చేశారు రేవంత్.
హైదరాబాద్ మంత్రి అండ…
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2021
ఉప్పల్ చౌరస్తాలో…
అనుమతి లేని అక్రమ నిర్మాణం…
ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు…@ktrtrs మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..?
లేదా మీరూ భాగస్వాములేనా…!?@telanganaCMO@CommissionrGHMC pic.twitter.com/zUoiZmQXbE