కేసీఆర్ ఇంచార్జ్గా ఉన్న ఊళ్లో రేవంత్ రెడ్డి ప్రచారం

సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇంచార్జ్గా ఉన్న లెంకలపల్లి గ్రామంలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. లెంకలపల్లి  బస్టాండ్లో కేసీఆర్ తట్టెడు మట్టి కూడా పోయలేదని మండిపడ్డారు. ఒక్కసారి గెలిచినవాళ్లు కోట్లు సంపాదిస్తే.. ఐదుసార్లు గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఏమి సంపాదించుకోలేదన్నారు. 

మోడీ, కేసీఆర్కు ప్రజలు గుణపాఠం చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో జరిగిన అభివృద్ధే తప్ప... టీఆర్ఎస్, బీజేపీ మునుగోడు అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. ఒక్కసారి పాల్వాయి స్రవంతికి అవకాశం ఇవ్వాలని కోరారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పారు.