తెలంగాణ సాధించిన సారుకు.. సర్కారు చేసిన సన్మానం!

తెలంగాణ సాధించిన సారుకు.. సర్కారు చేసిన సన్మానం!

భారత్ బంద్ లో  టీజేఎస్ చీఫ్ కోదండరాంపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ తెచ్చిన సారుకు..సర్కారు చేసిన సన్మానం అంటూ ట్వీట్ చేశారు. కోదండరాం అరెస్ట్ చేసిన న్యూస్ కు సంబంధించిన వెలుగు పేపర్ క్లిప్ ను రేవంత్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

అగ్రిచట్టాలు రద్దు, పెట్రోధరలు తగ్గింపుపై నిర్వహించిన భారత్ బంద్ లో   టీజేఎస్ చీఫ్ కోదండరాంపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. భారత బంద్ లో భాగంగా  హయత్  నగర్  డిపో వద్ద ఆయన ఆందోళనలో పాల్గొనేందుకు  వెహికల్ లో వచ్చారు. వెహికల్ నుంచి దిగకముందే కోదండరాంను పోలీసులు  కిందికి లాగి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఆయన ప్యాంట్ చిరిగింది. అట్లనే 
పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.