రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. పార్లమెంట్ సాక్షిగా యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఈ రెండు పార్టీలు అవసరమా? ప్రజలారా ఓసారి ఆలోచించండి అని రేవంత్ అన్నారు.
‘బీజేపీ, టీఆర్ఎస్ల రాజకీయ క్రీడలో తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. స్వరాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లైనా హమీల అమలులో ఇద్దరూ విఫలమయ్యారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఈ రెండు పార్టీలు తెలంగాణకు, దేశానికి అవసరమా!? ఆలోచించండి!’ అని రేవంత్ ట్వీట్ చేశారు.
బీజేపీ - టీఆర్ఎస్ ల రాజకీయ క్రీడలో తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. స్వరాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లైనా హమీల అమలులో ఇద్దరూ విఫలమయ్యారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఈ రెండు పార్టీలు తెలంగాణకు, దేశానికి అవసరమా!? ఆలోచించండి! pic.twitter.com/3q4iuT5wKL
— Revanth Reddy (@revanth_anumula) January 25, 2022
For More News..