నిర్మల్, వెలుగు : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం నిర్మల్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కలెక్టరేట్ రోడ్డులోని క్రషర్ గ్రౌండ్లో జరిగే సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ అభ్యర్థి శ్రీహరిరావుతో పాటు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మండలాల వారీగా ఇన్చార్జిలను కూడా నియమించారు.
రేవంత్ రెడ్డి బహిరంగ సభను సక్సెస్ చేసి సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్ నిర్మల్, భైంసాలో పర్యటించారు. ఈనెల 26న బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ కూడా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటనను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.