ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలి

రామకృష్ణ కుటుంబం సూసైడ్ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు ప్రమేయం ఉందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ కేసు విషయంలో పరారీలో ఉన్న వనమా రాఘవ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వనమ రాఘవ చేసిన అరాచకలన్నింటిని రామకృష్ణ చెప్పుకొచ్చాడు. తన భార్యను రాఘవ తీసుకు రమ్మన్నాడంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తన కుటుంబం బతకలేక.. ఆత్మహత్య చేసుకుంటుందని వివరించాడు. తాజాగా ఈ వ్యవహారంపై ఇప్పుడు  రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్లు రామకృష్ణ సెల్ఫీ వీడియో పెట్టాడన్నారు. సమస్య పరిష్కారం కోసం వెళ్తే.. చాలా దారుణంగా మాట్లాడాడంటూ రామకృష్ణ వీడియోలో తెలిపాడని అన్నారు. ఎమ్మెల్యే కొడుకు రాఘవ దౌర్జన్యాలను ఈ వీడియో వెల్లడిస్తుందని తెలిపారు. వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని రేవంత్ అన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమాతో రాజీనామా చేయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలన్నారు. కుటుంబాన్ని వేధించిన తీరు చూసి సీఎం ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ వీడియో పోస్టు చేశారు. 

ఇవి కూడా చదవండి:

వనమా రాఘవ పరారీ.. గాలిస్తున్న పోలీసులు

పార్టీ పరువు పోతుందని రాఘవను అరెస్ట్ చేయట్లేరు