బీసీ కులగణన సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై TPCC షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీల మనోభావాలు దెబ్బతినేలా కులగణన నివేదికను తగలబెట్టినందుకు TPCC క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈక్రమంలో తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులిచ్చింది.
బిసీ కులగణన నివేదికను తగలబెట్టడం, ఏఐసీసీ అగ్రనేత, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా మీడియాలో పరుష పదజాలం ఉపయోగించడం, పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టీ వ్యక్తిగత ఎజెండా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని షోకాజ్ నోటీసులు తెలిపారు.
ALSO READ | ఓవర్ టు ఢిల్లీ: హస్తినకు అధికార పక్షం, ప్రతిపక్షం
ఫిబ్రవరి12లోగా షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని తెలిపిన TPCC క్రమశిక్షణ కమిటీ..కాంగ్రెస్ రాజ్యాంగం నిబంధనల మేరకు వివరణ రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని తీన్మార్ మల్లన్నను హెచ్చరించింది.