హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు మరోసారి బయటపడ్డాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తు కోసం నిర్వహించిన సమావేశంలో పార్టీ లీడర్లు.. పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందే కొట్టుకున్నారు. కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టంవచ్చినట్లు కొట్టుకున్నారు. హైదరాబాద్ ఇందిరా భవన్‌లో శుక్రవారం రెండోసారి జరిగిన జీహెచ్‌ఎంసీ సన్నాహక సమావేశంలో ఈ గొడవ జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నగర, బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో రెండో సన్నాహక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం జరుగుతుండగా.. అధ్యక్షుడు ఉన్నాడనే విషయాన్ని కూడా మరచి కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ మరియు మహమ్మద్ గౌస్‌లు గొడవకు దిగారు. విచక్షణ కోల్పోయిన రెండు వర్గాలు ఒకరినొకరు కొట్టుకున్నారు. గొడవ పెద్దది కావడంతో.. ఉత్తమ్ కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
అంతకుముందు సెప్టెంబర్ 8న మొదటి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కూడా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆనాటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ శ్రావణ్, నిరంజన్‌లు ఉత్తమ్ ముందే గొడవపడ్డారు.
#WATCH Telangana: A scuffle broke out between two groups of Congress leaders during a preparatory meeting for Greater Hyderabad Municipal Corporation elections, in Hyderabad yesterday. State Congress chief Uttam Kumar Reddy was present at the meeting. pic.twitter.com/YS4HSmvrpX
— ANI (@ANI) September 12, 2020