కులగణన సర్వే అడ్డుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు కుట్ర: అద్దంకి దయాకర్

కులగణన సర్వే అడ్డుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు కుట్ర: అద్దంకి దయాకర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని విమర్శించడం బీఆర్ఎస్ నాయకులకు రివాజుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర కులగణన జరిగితే వాళ్ళ ఆర్థిక, సామాజిక విషయాలు బయట పడతాయని అనుకుంటున్నారని.. అందుకే బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సర్వే జరగకుండా  కాంగ్రెస్ ప్రభుత్వం విషం చిమ్ముతున్నారని విమర్శించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర కులాల పట్ల సర్వేను అడ్డుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకుల వైఖరి ఏంటో స్పష్టం ప్రజలకు అర్థం అవుతుందని అన్నారు. జనగణన జరిగితే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చో ఒక క్లారిటీ వస్తుందని.. అందుకే ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా లెక్కల్లో కులం కాలం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో డిమాండ్ చేస్తోందని తెలిపారు.