కేసీఆర్వి సుపారీ రాజకీయాలు:అద్దంకి దయాకర్

హైదరాబాద్:గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అవినీతి అక్రమాల వల్ల బీజేపీకి సుపారీ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు కాంగ్రెస్ నేత, టీపీసీసీ ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్. కాంగ్రెస్ను ఓడించేందుకు సుపారీ తీసుకొని బీజేపీతో అగ్రిమెంట్ చేసుకున్నారని విమర్శించారు. అం దుకే నిన్న కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా స్పందించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది వందకు వంద శాతం నిజమన్నారు. 

ఈ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. కేసీఆర్ ఎక్కడ తగ్గినా..ఎక్కడ పెరుగుతున్నా అది బీజేపీ కోసమే అని విమర్శించారు.బీఆర్ఎస్, బీజేపీలు కలి సి కాంగ్రెస్కు నష్టం కలిగించాలని కొన్ని నియోజకవర్గాల్లో కక్ష గట్టి బీఆర్ఎస్రాజకీయాలు చేస్తుందన్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాం టి రాజకీయాలతో కేసీఆర్ సొంత పార్టీనే నాశనం అవుతుంది.. నష్టపోతుందని తెలిసినా కూడా కేసీఆర్ ఏమాత్రం తగ్గడం లేదని అద్దంకి దయాకర్ అన్నారు.