ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ గా కోనేరు కృష్ణారావు ఎంపిక రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ లీడర్ అనిల్ కుమార్ కామ్రే అన్నారు. ఎస్టీ మహిళకు కేటాయించిన స్థానాన్ని ఓసీ సామాజికవర్గం వ్యక్తికి కట్టబెట్టారంటూ శనివారం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆదివాసీలకు దక్కిన రాజ్యాంగ హక్కులను ఆధిపత్య వర్గాలు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
తక్షణమే ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించి మరో ఎస్టీ(మహిళ) ను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు శ్రీమాన్, ప్రకాశ్, వినోద్, వెంకటేశ్ ఉన్నారు.