మెట్ పల్లి, వెలుగు : అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్డే మీల్స్కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటిని ముట్టడిస్తామని టీపీసీసీ లీడర్జువ్వాడి కృష్ణారావు హెచ్చరించారు.
ఆదివారం మెట్‌పల్లిలో పలువురు ఉద్యోగుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు జెట్టి లింగం, లింగారెడ్డి, మహేందర్ రెడ్డి, మారుతి పాల్గొన్నారు.