రాష్ట్రంలో కులగణన జరగకుంటే అసలు ఎన్నికలు కూడా జరగవని.. కులగణన కోసం అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టామని టీపీసీసీ మహేష్ కుమార్ అన్నారు. మరో నాలుగైదు రోజుల్లో కులగణనకు సంబంధించిన విధివిధానాలు రావొచ్చని, కులగణనపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వివరించారు. కులగణన చేయకపోతే టీపీసీసీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ కు చెప్పానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎవరికీ దక్కాల్సిన వాటా వారికి దక్కాలనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించామని మహేష్ తెలిపారు.
దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని మల్లాకార్జున్ ఖర్గే చెప్పారని గుర్తు చేశారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కులగనన కార్యక్రమాన్ని బేగంపేట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టిపిపిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ వెల్ఫేర్ నేషనల్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరైయారు.
కులగణనకు సీఎం రేవంత్ ఒప్పుకున్నారని సమావేశంలో టీపీసీసీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట చెప్పగానే బీఆర్ఎస్ వాళ్లు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. RSS చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పారు.. కానీ ఇప్పుడు బీజేపీ మాట మార్చిందని టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్పారు. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతుంది.. అందుకే రిజర్వేషన్స్ పై మాట మార్చారు. బీజేపీ కులగణన వ్యతిరేకిస్తుంది. బీసీ ప్రధానిగా ఉన్నాడని బిజెపి చెప్తుంది. దాని వల్ల ఏ బీసీకి న్యాయం జరిగిందని ఆయన ప్రశ్నించారు. అంబానీ, అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి, వాళ్లు ఏ వర్గం, ఎవరి అండతో వాళ్లు అన్ని ఆస్తులు సంపాదిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ALSO READ | హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ .. ఈ వార్తలు అస్సలు మిస్ కావొద్దు..