సూర్యాపేట, వెలుగు : మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతి కారణంగా మున్సిపాలిటీలోనే అనేక వార్డులు అభివృద్ధికి నోచుకోలేవని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి ఆరోపించారు. గడప గడపకు కాంగ్రెస్, -యూత్ డిక్లరేషన్ ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని 43 వ వార్డులో కౌన్సిలర్ నామ అరుణ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43 వార్డు మురికి కూపంగా మారిందని, కనీసం కాలువల పూడిక తీయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డులను కావాలనే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 43 వ వార్డును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.