అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్‌లో అణువణువూ కనిపిస్తోందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు. లగచర్ల దాడిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ ప్రెస్ మీట్ పెట్టారు. అధికారులపై దాడి హేయమైన చర్య..కేటీఆర్ కు శిక్ష తప్పదని ఆయన అన్నారు. లెక్కలు తీస్తే.. దాడికి కుట్ర చేసిన వాళ్ల బొక్కలు విరుగుతాయని ఆయన అన్నారు. భూమలు లేనివారు కలెక్టర్ పై దాడి చేశాని.. ముమ్మాటికీ ఇది కుట్రనే అని ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ భారీ కుట్రలు చేస్తుంది.. పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందన్నారు.
మహేశ్ గౌడ్ అభివృద్ధి వికేంద్రీకరణను బిఆర్ఎస్ అడ్డుకుంటోందని మాట్లాడారు. దాడికి సంబంధించి కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారని చెప్పారు. ప్రభుత్వం అధికారులపై దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆరే అని ఆయన అన్నారు. ఈ ఫార్ములాలో డబ్బులు చేతులు మారాయి,ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ 2 లేదా 3న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సంవత్సరం పాలనా కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. నవంబర్16 నుంచి జిల్లాల పర్యటన చేస్తానని ఆయన మీడియాకు వివరించారు.