హైదరాబాద్ : బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామన్నా రు. 'ప్రజాప్రభుత్వంచేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మీ పార్టీ నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. సెంటిమెంట్ పేరుతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించి.. పీఠమెక్కాక మాయమాటలతో పాలించారు.
మీ అల్లుడు హరీశ్ రావు, పెట్రోల్ డబ్బాతో, అగ్గిపుల్లతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాలవైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా? మేము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 54 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పాం. ఉద్యమ టైంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన మీరు అధి కారంలోకి వచ్చాక మీ ఫ్యామిలీకే ఉపాధి కల్పిం చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు, మీ అను చరులకు ఒక ఏటీఎంలా మారిందనేది అక్షరాల సత్యం. వరంగల్లో రైతు డిక్లరేషన్ కు ఐడి రూ.21 వేల కోట్లు రైతు రుణ మాఫీ చేశాం. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు రుణమాఫీ సహాయాన్ని పొందడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం.
ఖరీఫ్ సీజన్లో 66.76 లక్షల ఎకరా ల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసేలా సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ల రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మీరు మార్చింది వాస్తవం కాదా? మూసీ పునరుజ్జీవ సుందరీకరణలో అవినీతి జరిగిందని మీ పుత్రరత్నం గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ కోసం రూ.150 కోట్లే ఖర్చు చేశాం. మూసీ కోసం అదనంగా ఖర్చు చేయలేదని మీరు గుర్తించాలి' అని సూచించారు.
అవాకులు చెవాకులు మానేయ్
'నాడు సకల జనులను ఉద్యమబాట పట్టిం చిన జయజయహే తెలంగాణ.. జననీ జయ కేతనం గీత రచయిత ఆందెశ్రీ పై బీఆర్ఎస్ పాలసలో కక్షగట్టి అవమానించారు. రాష్ట్రాని కిపదేండ్లు అధికారిక గీతం లేకుండా చేశారు. మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆ పాటను రాష్ట్రగీతంగా గౌరవించుకున్నాం. కేసీఆర్పాలనలో తెలంగాణ తల్లికి గుర్తింపు లేదు. మా పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నది మీరు తెలుసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మానుకోవాలి. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు, కవితను కేసీఆర్ అదుపులో పెట్టాలి. దళితుడిని సీఎం చేస్తానని మాయమాటలతో సీఎం పీఠం ఎక్కి.. అధికారం చేపట్టగానే కుటుంబ పాలస సాగించావ్. రాష్ట్రాన్ని పదేండ్లు మీ కుటుంబ సభ్యుల కంబంధ హస్తాల్లో బంధించావు... కేసీఆర్ మీరు చేసిన అరాచకాన్ని ప్రజలు ఎప్పటికీ మరవరు' అని మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు.