రాహుల్ యాత్రలో పాల్గొన్న రేవంత్ 

రాహుల్ యాత్రలో పాల్గొన్న రేవంత్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో కొనసాగుతున్న రాహుల్ యాత్రలో సోమవారం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన రేవంత్... రాహుల్ యాత్రకు భారీగా స్పందన వస్తోందని చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల నుంచి దేశాన్ని కాపాడేందుకు దేశ నలుమూలల నుంచి అనేక మంది రాహుల్ యాత్రలో పాలుపంచుకుంటున్నారని రేవంత్ స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను చేపట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 3,500 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 150 రోజుల పాటు రాహుల్ ఈ యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని పున్నమాడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ పాల్గొన్నారు. రేసర్ల మధ్యలో కూర్చొని బోటులో ప్రయాణించారు.