కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బల్దియా మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేపూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పూల్లా పద్మావతి, మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆయూబ్
తదితరులున్నారు.